ఎవడయ్యా హైదర్.. ఎవడికి కావాలి హైదర్?: కిషన్ రెడ్డి
- బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్న కిషన్ రెడ్డి
- హైదరాబాద్ పేరును మార్చడంలో తప్పేముందని ప్రశ్న
- బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి పేరును మారుస్తామని వ్యాఖ్య
బీజేపీ అధికారంలోకి వస్తే బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి ఒక్కదాని పేరును మారుస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. మేధావుల సలహాలను తీసుకుని మారుస్తామని తెలిపారు. ఆలోచనా విధానాల్లో కూడా మార్పును తీసుకొస్తామని అన్నారు. ముస్లింలు అన్ని విధాలుగా వెనుకబడ్డారని... వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.