'బిజినెస్ మ్యాన్' సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చా: మంత్రి మల్లారెడ్డి
- ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి వెల్లడి
- మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా సోమవారం జరిగిన ఈవెంట్
- హీరో రణబీర్ కపూర్ తో పాటు హాజరైన యానిమల్ మూవీ టీమ్
యానిమల్ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చిన అందరికీ స్వాగతం పలికిన మంత్రి మల్లారెడ్డి.. చీఫ్ గెస్ట్ మహేశ్ బాబు గురించి మాట్లాడారు. ‘మీ సినిమా బిజినెస్ మ్యాన్ పదిసార్లు చూశా. అది చూశాకే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీనయ్యా’ అనడంతో సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ కావాలంటూ రణబీర్ కపూర్ కు మంత్రి సలహా ఇచ్చారు. తెలుగు వాళ్లు బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటినీ ఏలేస్తారని, తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్మార్ట్ వాళ్లు ఉన్నారని చెప్పారు. రాజమౌళి, దిల్ రాజు లాంటి దిల్ ఉన్న వారు ఉన్నారని చెప్పారు. ఇక్కడి వారు స్మార్ట్ అని చెప్పడానికి రష్మికనే ఉదాహరణ అని, పుష్ప సినిమాలో అదరగొట్టిందని అన్నారు. ఈ సందర్భంగా యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటున్నట్లు మల్లారెడ్డి చెప్పారు.