Vijayasai Reddy: నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy suggets Nara Lokesh to test his tongue
  • లోకేశ్ యువగళం యాత్రపై విజయసాయిరెడ్డి విమర్శలు
  • ఎవరు నడవమన్నారో అంటూ సెటైర్లు
  • ఛాలెంజ్ చేయడానికి కూడా ఒక స్థాయి ఉండాలని విమర్శ

టీడీపీ యువనేత నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. లోకేశ్ గారికి నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారని అన్నారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు అని సూచించారు. ఛాలెంజ్ చేయడానికి కూడా ఒక స్థాయి ఉండాలని విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News