Mallu Bhatti Vikramarka: ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేస్తూ.. దేవాలయంలో రూ.100 స్టాంప్‌పై మల్లు భట్టి సంతకం

Mallu Bhatti signs on Rs 100 stamp over six guarentees
  • ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తమదేనన్న మల్లు భట్టి
  • మధిర నియోజకవర్గ అభివృద్ధికి అంకితమవుతానని హామీ
  • తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతామని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలని కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామ దేవాలయంలో... రూ.100 స్టాంప్‌పై సంతకం చేసి, ప్రమాణం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత తమదే అన్నారు. తాను మధిర నియోజకవర్గ అభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతామని వ్యాఖ్యానించారు.
Mallu Bhatti Vikramarka
Congress
Telangana Assembly Election

More Telugu News