digvijay singh: శ్రీరాముడు అందరివాడు... అందులో ఎలాంటి రాజకీయాలు లేవు: దిగ్విజయ్ సింగ్

  • తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న దిగ్విజయ్ సింగ్
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మిగిలిన విభజన హామీలను పూర్తి చేస్తామని హామీ
  • అన్ని వర్గాల బాగు కోసం సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించారని వెల్లడి
Digvijay Singh says Everty one respects lord rama

శ్రీరాముడు అందరివాడని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. బీజేపీ మాత్రం ధర్మం పేరిట దేవుడ్ని కూడా రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము విభజన రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ గెలుస్తోందన్నారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందని, కల్వకుంట్ల కుటుంబం అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మిగిలిన విభజన హామీలను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు.. అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

అన్ని వర్గాల బాగు కోసం సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించినట్లు చెప్పారు. తెలంగాణలో కౌలు రైతులకు న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక వారికి కూడా రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. వరి పంటకు బోనస్ ఇస్తామని ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విజన్ తో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఐటీలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతోందంటే అందుకు కారణం వైఎస్ నిర్ణయాలు అన్నారు. రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఐటీ రంగం నుంచి వస్తున్నట్లు చెప్పారు.

More Telugu News