Tiruvanantapuram: భారీ వర్షంతో తడిసి ముద్దయిన తిరువనంతపురం స్టేడియం... రేపు టీమిండియా-ఆసీస్ రెండో టీ20

Heavy rain lashes Tiruvanantapuram Green Field stadium
  • కేరళలో విస్తారంగా వర్షాలు
  • టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • రెండో మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురం 
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు (నవంబరు 26) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. అయితే, తిరువనంతపురంలో ఇవాళ భారీ వర్షం కురవడంతో ఇక్కడి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం జలమయం అయింది. పిచ్ పై కవర్లు కప్పినప్పటికీ మైదానంలో భారీగా నీరు నిలిచింది. 

ప్రస్తుతం ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి రేపు తిరువనంతపురంలో వాతావరణం ఎలా ఉంటుందన్నది అనిశ్చితిగా మారింది. విశాఖలో జరిగిన తొలి టీ20లో నెగ్గి ఊపుమీదున్న టీమిండియా... రెండో టీ20లోనూ నెగ్గాలని తహతహలాడుతున్నారు. వరుణుడు కరుణిస్తే రేపటి మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి.
Tiruvanantapuram
Rain
Green Field Stadium
2nd T20
Team India
Australia

More Telugu News