రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటే: మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ చెబుతున్న మార్పు ఆరు నెలలకో సీఎంను మార్చడమేనని ఎద్దేవా
- కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారన్న కేటీఆర్
- ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు. అరాచక పాలన అని ఆగ్రహం
మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించారని చెప్పారు. మనందరి కోసం పద్నాలుగేళ్ల పాటు ఢిల్లీ రాక్షసులతో పోరాడారన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసైన్డ్ భూములు ఉన్న వారికే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ గెలిచాక పెన్షన్ పెంచుతామన్నారు. ఏ రాష్ట్రంలోను బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వరని, కేసీఆర్ ఇస్తున్నారన్నారు.