మధురలో హేమామాలిని నృత్యం.. మీరాబాయిగా అలరించిన ఎంపీ.. వీడియో ఇదిగో!
- మీరాబాయి 525వ జయంతి వేడుకల్లో మాజీ నటి డ్యాన్స్ షో
- కృష్ణుడిపై మీరా ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించిన హేమామాలిని
- ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు
గురువారం మధురలో జరిగిన ఈ వేడుకలకు పెద్ధ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎంపీ హేమమాలిని చేసిన నృత్య ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చంగా మీరాబాయిని కళ్లముందుకు తీసుకొచ్చారంటూ ప్రదర్శన చూసిన ప్రేక్షకులు, వీడియో చూసిన నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, కొంతమంది మాత్రం హేమమాలినిని నటిగానే చూస్తామని, అదే ఆమెకు సరిగ్గా నప్పుతుందని చెబుతున్నారు. రాజకీయాలు ఆమెకు సరిపడవని, వదిలేయాలని సూచిస్తున్నారు. నటిగా హేమమాలిని అన్నా, ఆమె చేసే నృత్యమన్నా తనకెంతో ఇష్టమని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. అయితే, పొలిటీషియన్ గా ఆమె తనకు నచ్చదని చెప్పాడు. మరికొంతమంది కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.
