బెనారస్ హిందూ యూనివర్సిటీలో మళ్లీ అదే ఘటన.. యువతిని లైంగికంగా వేధించిన బస్ డ్రైవర్
- బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో విధుల నుంచి డ్రైవర్ తొలగింపు
- ఈ నెలలో ఇది రెండో ఘటన
- ఇటీవల ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన ముగ్గురు దుండగులు
అమ్మాయిలపై క్యాంపస్‌లో లైంగిక వేధింపులు జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెలలో ఐఐటీ-బీహెచ్‌యూకు చెందిన అమ్మాయిని ముగ్గురు దుండగులు లైంగిక వేధింపులకు గురిచేశారు. తాజా కేసు విషయానికి వస్తే బాధితురాలు బీకాం విద్యార్థిని. క్యాంపస్ బయట ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 19న డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు.