Kapil Dev: 'లాల్ సలామ్' చిత్రం కోసం డబ్బింగ్ పూర్తి చేసిన క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్

Kapil Dev completed dubbing for his role in Lal Salaam movie
షార్ట్స్‌లో చూడండి
తమిళ తలైవర్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లాల్ సలామ్'. ఈ చిత్రంలో రజనీకాంత్ 'మొయిద్దీన్ భాయ్' అనే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

కాగా, ఈ చిత్రంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఓ పాత్ర పోషిస్తుండడం విశేషం. తన పాత్ర కోసం కపిల్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. తాజాగా కపిల్ డబ్బింగ్ పూర్తయింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. ప్రస్తుతం 'లాల్ సలామ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపింది. 

2024 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, అనసూయ, తంబిరామయ్య తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. 
Go Back to Shorts
Kapil Dev
Dubbing
Lal Salaam
Aishwarya Rajinikanth
Rajinikanth
Kollywood

More Telugu News