Prakash Goud: చెప్పుతో కొడతాం... వెళ్లిపోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

RajendraNagar MLA faces irk from women in election campaign
  • రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై మహిళల ఆగ్రహం
  • తమ కాలనీలో సమస్యలు తీర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని నిలదీత
  • మహిళల నిరసనతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాజేంద్రనగర్‌కు వెళ్లిన ఆయనను కొంతమంది మహిళలు అడ్డుకున్నారు. తమ కాలనీలోని సమస్యలు తీర్చలేదని, అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు. సమస్యలు తీర్చకుండా ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తే చెప్పుతో కొడతాం.... వెళ్లిపోండి అని మండిపడ్డారు. మహిళల నిరసనతో షాకైన ప్రకాశ్ గౌడ్ ప్రచారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Prakash Goud
BRS
Rajendranagar
Telangana
Telangana Assembly Election

More Telugu News