Crime News: 18 ఏళ్ల కుర్రాడిని 60 సార్లకు పైగా దారుణంగా పొడిచి చంపిన 16 ఏళ్ల బాలుడు.. ఆపై డ్యాన్స్!

Delhi boy stabs 18 year old multiple times and then dances
  • ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో ఘటన
  • దోపిడీని అడ్డుకున్నందుకు కసిదీరా పొడిచి చంపిన నిందితుడు
  • వైరల్ అయిన వీడియో.. నిందితుడి అరెస్ట్
  16 ఏళ్ల ఓ బాలుడు 18 ఏళ్ల కుర్రాడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. కత్తితో కసిదీరా పదేపదే పొడుస్తూ అనందం అనుభవించాడు. ఆపై సంతోషం పట్టలేక డ్యాన్స్ చేశాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో జరిగిన ఈ వణుకుపుట్టించే ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.

బాలుడు ఆ కుర్రాడిని 60 సార్లకుపైగా కత్తితో పొడిచాడు. దోపిడీలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడిని తొలుత గొంతు నులిమి చంపేసిన బాలుడు.. అతడు స్పృహతప్పి పడిపోగానే కత్తితో పలుమార్లు పాశవికంగా పొడిచి చంపాడు. ఇద్దరూ ఒకరికొకరు తెలియదని, దోపిడీని అడ్డుకోవడంతోనే బాలుడు అతడిపై దాడిచేసి హతమార్చాడని పేర్కొన్నారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత యువకుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి నుంచి అతడు రూ. 350 దోచుకున్నట్టు వివరించారు. బాధిత యువకుడిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.
Crime News
New Delhi
Viral Videos

More Telugu News