Bhoomi Padnekar: ఆసుపత్రిలో బాలీవుడ్ హీరోయిన్.. నరకం అనుభవించానంటూ పోస్ట్

Bollywood actor bhoomi padnekar falling ill with dengue
  • డెంగీ బారినపడ్డ నటి భూమి పడ్నేకర్, ఆసుపత్రిలో చికిత్స
  • ప్రస్తుతం కాస్త కులాసా చిక్కిందంటూ నెట్టింట పోస్ట్
  • మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలంటూ అభిమానులకు సూచన
డెంగీ వ్యాధి బారిన పడ్డ ప్రముఖ బాలీవుడ్ నటి భూమీ పడ్నేకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కాస్తంత కోలుకున్న ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చాలా రోజుల తరువాత ఫ్రెష్‌గా ఫీలవుతున్నానంటూ పోస్ట్ పెట్టింది. 

‘‘ఒక డెంగీ దోమ నన్ను 8 రోజుల పాటు చిత్రహింసలు పెట్టింది. ఈ రోజు నిద్రలేచాక ఎటువంటి ఇబ్బందీ అనిపించలేదు. కాబట్టి.. ఓ చిన్న సెల్ఫీ తీసుకున్నా. మీరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. నా అనారోగ్యం కారణంగా మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడింది. మస్కిటో రిపెల్లెంట్స్‌ను కచ్చితంగా వాడండి. కాలుష్యం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. నాకు తెలిసిన వారు కూడా డెంగీ బారినపడ్డారు. కంటికి కనిపించని ఓ వైరస్ పరిస్థితిని బాగా దిగజార్చింది’’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌పెట్టింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలిపింది.

భూమి పడ్నేకర్, అర్జున్ కపూర్ కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ది లేడీ కిల్లర్’ ఇటీవలే విడుదలై అభిమానులను అలరిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, అర్జున్ కపూర్‌తో కలిసి ఆమె నటిస్తున్న మరో చిత్రం కూడా నిర్మాణ దశలో ఉంది.
Bhoomi Padnekar
Bollywood
Dengue
The Lady Killer

More Telugu News