Kollapur: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి

Kollapur independent candidate Barrelakkas younger brother attacked
  • ప్రచారంలో అకస్మాత్తుగా జరిగిన దాడితో కన్నీటి పర్యంతమైన శిరీష 
  • ఓట్లు చీలుతాయనే భయంతోనే దాడులు చేస్తున్నారని మండిపాటు
  • పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్.. రోడ్డుపై బైఠాయింపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి సంచలనంగా మారిన బర్రెలక్కపై (శిరీష) మంగళవారం దాడి జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బర్రెలక్కకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నవారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆమె ఉలిక్కిపడింది. తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని, తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓట్లు చీలుతాయనే భయంతోనే తనపై రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. కాగా బర్రెలక్కపై దాడిని ఖండిస్తూ పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమెకు భద్రతకు కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని ప్రశ్నించారు.

కాగా తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క హాట్ టాపిక్‌గా మారింది. ప్రచారంలో దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. నామినేషన్ వేసినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె పెద్ద చర్ఛనీయాంశంగా మారింది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది.
Kollapur
Barrelakka
Telangana
Telangana Assembly Election

More Telugu News