Venkatesh Iyer: యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌కు ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

Engagement of young cricketer Venkatesh Iyer and Photos went viral
  • శ్రుతి రఘునాథ్‌తో వెంకటేశ్ అయ్యర్ వివాహ నిశ్చితార్థం
  • కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం జరిగిన వేడుక
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు షేర్ చేసిన అయ్యర్
భారత యువ సంచలనం, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగువేయబోతున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. కాబోయే భార్య శ్రుతి రఘునాథ్‌తో మంగళవారం అతడి వివాహ నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విషయాన్ని వెంకటేశ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు ఫొటోలను షేర్ చేశాడు. 

ఇక ఫొటోల్లో కాబోయే దంపతులు చూడముచ్చటగా కనిపించారు. కాబోయే భార్య శ్రుతి ర‌ఘునాథ‌న్ ఫ్యాష‌న్ డిజైనింగ్‌లో మాస్ట‌ర్స్ చేసింది. బెంగ‌ళూరులోని ఓ ఫ్యాష‌న్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్‌కు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్‌తోపాటు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

కాగా వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి అనతి కాలంలోనే మంచి పాప్యులారిటీ సంపాదించాడు. ఆల్ రౌండర్‌గా రాణిస్తుండడంతో చక్కటి గుర్తింపు దక్కింది. తక్కువ కాలంలోనే టీమిండియాలో చోటు కూడా సంపాదించాడు. 2021 ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా ఆడి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. పది మ్యాచుల్లో 41.11 స‌గ‌టుతో 370 ప‌రుగులు చేయడంతో అతడి ప్రతిభ బయటపడింది. 2023 ఐపీఎల్ మినీ వేలంలో వెంకటేశ్ అయ్యర్ రూ.8 కోట్లకు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. 1 సెంచ‌రీ, 2 హాఫ్ సెంచ‌రీల‌తో 14 మ్యాచుల్లో 404 ప‌రుగులు చేశాడు. 

2024 ఐపీఎల్ వేలంలో కోల్‌క‌తా జట్టు అయ్య‌ర్‌ను 2023 మినీ వేలంలో రూ. 8 కోట్ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఈ సీజ‌న్‌లో ఓ సెంచ‌రీ, రెండు హాఫ్ సెంచ‌రీల‌తో 14 మ్యాచుల్లో 404 ప‌రుగులు చేశాడు. 2024 ఐపీఎల్ వేలంలో కోల్‌క‌తా జట్టు అయ్య‌ర్‌ను కోల్‌కతా రిటైన్ చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. వెంకటేశ్ భారత్ తరపున ఇప్పటివరకు 9 టీ20లు, 2 వ‌న్డేలు ఆడాడు. చివ‌ర‌గా గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు.
Venkatesh Iyer
Marriage engagement
Team India
Cricket
Kolkata
Viral Pics

More Telugu News