రామ్ చరణ్ సరసన సారా టెండూల్కర్?
- చెర్రీతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్న డైరెక్టర్ బుచ్చిబాబు
- ప్రస్తుతం కొనసాగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
- సారా టెండూల్కర్ కోసం ప్రయత్నిస్తున్న బుచ్చిబాబు
వివరాల్లోకి వెళ్తే, రామ్ చరణ్ తో యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు, ఈ సినిమాలో క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట. చెర్రీ సరసన సారా టెండూల్కర్ ను నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. మరి, బుచ్చిబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.