ఓటమితో వెక్కివెక్కి ఏడ్చేసిన సిరాజ్.. ఓదార్చిన బుమ్రా.. వీడియో ఇదిగో!
- ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్
- ఓటమిని జీర్ణించుకోలేకపోయిన మహ్మద్ సిరాజ్
- కళ్లలోంచి ఉబికి వచ్చిన నీళ్లు
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది.