Praveen Prakash: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

National ST Commission issues notice to AP School Education Principle Secretary Praveen Prakash
  • చిక్కుల్లో పడిన ప్రవీణ్ ప్రకాశ్
  • ఓ కాంట్రాక్టు ఉద్యోగిని పట్ల వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు
  • వారం రోజుల్లో ప్రవీణ్ ప్రకాశ్ వివరణ ఇవ్వాలంటూ ఎస్టీ కమిషన్ నోటీసులు
ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు పంపింది. ప్రవీణ్ ప్రకాశ్ ఓ కాంట్రాక్టు ఉద్యోగిని పట్ల వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు అందింది. శ్రీకాకుళం జిల్లా సారవకోటకు చెందిన పి.నిర్మల అనే మహిళ ఈ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన ఎస్టీ కమిషన్... వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాశ్ ను ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు వారం రోజులు గడువు విధించింది.
Praveen Prakash
ST Commisson
Notice
Principle Secretary
School Education
YSRCP
Andhra Pradesh

More Telugu News