Vellampalli Srinivasa Rao: ఆ ముగ్గురికి సిగ్గు, శరం ఉన్నాయా?: వెల్లంపల్లి శ్రీనివాస్

These three are shameless people says Vellampalli Srinivas
  • చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై వెల్లంపల్లి విమర్శలు
  • విజయవాడలో అత్యధిక రోడ్లు వేసింది తమ ప్రభుత్వమేనని వ్యాఖ్య
  • దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురికీ సిగ్గు, శరం లేవని అన్నారు. విజయవాడలో అత్యధికంగా రోడ్లు వేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. టీడీపీ పాలనలో రోడ్లు వేసి ఉంటే ఈరోజు తాము రోడ్లు వేయాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. జలీల్ ఖాన్, జనసేన నేతల ఇళ్ల ముందు కూడా తామే రోడ్లు వేశామని చెప్పారు.

రూ. 400 కోట్లతో కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత సీఎం జగన్ దని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పారు. తెలంగాణలో ఎనిమిది మందిని పోటీకి నిలబెట్టి సొంత పార్టీని పవన్ నట్టేట ముంచేశారని అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లారని... లోకేశ్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే నారా భువనేశ్వరి ఓదార్పు యాత్రను వదిలేశారని ఎద్దేవా చేశారు.
Vellampalli Srinivasa Rao
Jagan
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News