Dharmana Prasada Rao: జగన్ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధర్మాన

Minister Dharmana launches book on CM Jagan administration
  • జగన్ పాలనపై పుస్తకం రాసిన వేణుగోపాల్ రెడ్డి
  • పుస్తకం పేరు... 'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్'
  • ఏపీ సచివాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • రచయితకు అభినందనలు తెలిపిన మంత్రి ధర్మాన
ఏపీలో సీఎం జగన్ పాలనపై రచయిత వేణుగోపాల్ రెడ్డి పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకం పేరు 'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్'. ఇవాళ ఏపీ సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత వేణుగోపాల్ రెడ్డి పూర్తిగా అధ్యయనం చేశాకే ఈ పుస్తకం రాశారని ధర్మాన తెలిపారు. 

పరిపాలనలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త విధానాలను ఈ పుస్తకంలో వివరించడం వల్ల వాటి గురించి భవిష్యత్ తరాలకు తెలుస్తుందని అన్నారు. రచయిత వేణుగోపాల్ రెడ్డికి ప్రభుత్వం, పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నట్టు ధర్మాన వెల్లడించారు. 

'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' పుస్తక రచయిత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి విషయంలో సీఎం జగన్ కు ఉన్న స్పష్టతను ఈ పుస్తకంలో పొందుపరిచానని వివరించారు. పుస్తకావిష్కరణ చేసిన మంత్రి ధర్మానకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Dharmana Prasada Rao
Book
CM Jagan
Venugopal Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News