Satyavathi Rathod: మంత్రి సత్యవతి రాథోడ్‌పై గూడురు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... ఎందుకంటే..!

Police case files against minister satyavathi rathode
  • బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారం కోసం వెళ్లిన సత్యవతి రాథోడ్
  • మంత్రికి హారతి ఇచ్చి స్వాగతం పలికిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు
  • హారతి పళ్లెంలో రూ.4వేలు వేసిన సత్యవతి రాథోడ్

మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్ జిల్లా గూడురు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారం కోసం ఇటీవల కొంగరగిద్దకు సత్యవతి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చారు. ఈ సమయంలో సత్యవతి రాథోడ్ మంగళహారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులిచ్చారని ఎఫ్ఎస్‌టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఎస్‌టీ టీమ్ ఫిర్యాదు నేపథ్యంలో గూడురు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News