Chidambaram: ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో కేసీఆర్ కు అవగాహన లేదు: చిదంబరం

KCR has no idea on Andhra Pradesh formation says Chidambaram
  • తెలంగాణ పరిస్థితిని చూసి అసంతృప్తి కలిగిందన్న చిదంబరం
  • నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శ
  • రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు గుర్తున్నాయని వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని చూసి తనకు చాలా అసంతృప్తి కలిగిందని చెప్పారు. రాష్ట్రంలో ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో చెప్పి ఆ తర్వాత మోసం చేశారని విమర్శించారు. 

కేసీఆర్ కి చరిత్రపై సరైన అవగాహన లేదని... ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో సరిగా తెలుసుకోలేదని చిదంబరం ఎద్దేవా చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడారో తనకు గుర్తుందని తెలిపారు. కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ అంటున్నారని... తనకు వచ్చే సీట్లతో ఆయన కేంద్రంలో చక్రం ఎలా తిప్పుతారని ఎద్దేవా చేశారు.
Chidambaram
Congress
KCR
BRS

More Telugu News