Chidambaram: ధరలు, ద్రవ్యోల్భణం, నిరుద్యోగం.. అన్నీ తెలంగాణలోనే ఎక్కువ: చిదంబరం విమర్శలు

Chidambaram fires at kcr government
  • కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందన్న చిదంబరం
  • గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉందన్న కాంగ్రెస్ నేత
  • కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అప్పు భారీగా పెరిగిందని విమర్శలు
కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. గురువారం నాంపల్లి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెబుతూ... గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగిత రేటు దేశ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. ఖాళీగా ఉన్న 80వేల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ భృతి హామీని అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ రేటు మహిళల్లో 9.5 శాతం, పురుషుల్లో 7.8 శాతంగా ఉందన్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అప్పు భారీగా పెరిగిందన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడిపై సగటున రూ.1 లక్ష అప్పు ఉందన్నారు. కేసీఆర్ విద్యా రంగానికి కేటాయిస్తున్న నిధులు దేశ సగటు కంటే తక్కువ అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతే అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నార్నారు. నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు కూడా ఎక్కువే అన్నారు. తెలంగాణ వ్యాట్ ఎక్కువగా వసూలు చేస్తోందన్నారు. రాష్ట్ర అప్పులు రూ.3.66 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు.
Chidambaram
Congress
Telangana Assembly Election
KCR

More Telugu News