Narendra Modi: పిల్లలతో కలిసి మోదీ అల్లరి.. వీడియో ఇదిగో!

  • చిన్నారులతో కలిసి కాసేపు ఆడిన మోదీ
  • తాను కూడా పిల్లాడిలా మారిన వైనం
  • వీడియో షేర్ చేసిన బీజేపీ
Modi playing with children

అధికారిక కార్యక్రమాలు, రాజకీయలతో అనునిత్యం ఎంతో బిజీగా ఉండే ప్రధాని మోదీ కాసేపు చిన్నారులతో కలిసిపోయి ఆడుతూ కనిపించారు. వారితో కలిసి ఆయన కూడా పిల్లాడిలా మారిపోయారు. ఈ వీడియోను బీజేపీ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. మోదీ కూడా ఈ వీడియోను తన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశారు. తన చిన్నారి మిత్రులతో కొన్ని గుర్తిండిపోయే క్షణాలు అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియోను ఎప్పుడు తీశారనేది మాత్రం పేర్కొనలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

More Telugu News