Vamsi: ఇళయరాజాగారు నన్ను అంతమాట అనడానికి అదే కారణం: డైరెక్టర్ వంశీ

Vamsi Interview
  • 'జోకర్' సమయంలో జరిగిన సంఘటనపై వివరణ
  • ఓ నిర్మాత ఇళయరాజాకు డబ్బు ఎగ్గొట్టాడని వ్యాఖ్య 
  • తాను అడిగినంత ఇస్తేనే చేస్తానన్నారని వెల్లడి 
  • దాంతో 'జోకర్' సినిమాకి నేనే మ్యూజిక్ చేశానన్న వంశీ  

దర్శకుడిగా వంశీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. దాదాపు ఆయన సినిమాలకి సంగీత దర్శకుడిగా ఇళయరాజానే ఉన్నారు. 'మహా మ్యాక్స్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ, "ఇళయరాజా గారికీ .. నాకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరం కలిసి కొండల్లో .. అడవుల్లో తిరిగి అనుభూతి చెందిన సందర్భాలు ఉన్నాయి. అందువల్లనే మా సినిమా పాటలు బాగా వచ్చాయేమో" అన్నారు. 

'డిటెక్టివ్ నారద' సినిమాలో 'యవ్వనాల పువ్వులన్ని' పాటను నేనే ట్యూన్ చేసి, ఇలా ఉండాలని ఆయనకి చెప్పాను. నిజానికి నేను అలా చేసి ఉండకూడదు .. కానీ ఆయన నన్ను ఏమీ అనలేదు. అలా చేస్తే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి అయినా కోపం వస్తుంది. కానీ ఆయన, నేను చెప్పినట్టుగానే అదే ట్యూన్ లో పాట చేసి ఇచ్చారు" అని అన్నారు. 

"అలాంటి ఇళయరాజా గారు 'జోకర్' సినిమా సమయంలో, 'నేను అడిగినంత డబ్బులు ఇస్తేనే మ్యూజిక్ చేస్తాను అని తేల్చి చెప్పారు. ఆయన అలా అడగడానికి కారణం ఉంది. అంతకుముందు నా సినిమా నిర్మాత, ఇళయరాజాగారికి ఇస్తానని చెప్పిన ఎమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఆ డబ్బులు వచ్చేలా నేను చేస్తానని ఆయన అనుకున్నారు. కానీ అలా జరగలేదు .. దాంతో ఆయన అలా మాట్లాడారు. దాంతో 'జోకర్' సినిమాకి నేనే మ్యూజిక్ చేశాను" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News