Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతమంది పోటీ చేస్తున్నారంటే..!

312 members contersting from ghmc 15 constituencies
  • జీహెచ్ఎంసీ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో పోటీలో 312 మంది
  • 15 నియోజకవర్గాల్లో ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ
  • రంగారెడ్డి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో బరిలో 173 మంది

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటి మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేస్తున్నారో ఖరారైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 15 నియోజకవర్గాలలో ఇరవై మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఉన్న వారి జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. 15 స్థానాలకు గాను 312 మంది పోటీ చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీ నగర్‌లో 38 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్‌లో 25 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది, చేవెళ్లలో 12 మంది పోటీలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి.

  • Loading...

More Telugu News