KCR: వరుస బహిరంగసభలతో హోరెత్తిస్తున్న కేసీఆర్.. నేటి షెడ్యూల్ ఇదే!

KCR election campaigning schedule
  • ప్రచారంలో దూసుకుపోతున్న కేసీఆర్
  • నేడు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న గులాబీ బాస్
  • కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గులాబీమయమైన మూడు నియోజకవర్గాలు
తెలంగాణ ఎన్నికల ప్రచారపర్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకుపోతున్నారు. వరుస బహిరంగసభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈరోజు కూడా మూడు బహిరంగసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు ఆయన పర్యటన ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో కొనసాగనుంది. తొలుత నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కేసీఆర్ వస్తున్న తరుణంలో మూడు నియోజకవర్గాలు గులాబీ జెండాలు, పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. హెలికాప్టర్ ద్వారా బీఆర్ఎస్ అధినేత సుడిగాలి పర్యటన చేయనున్నారు.

KCR
BRS
Election Campaigning

More Telugu News