మునుగోడు ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోడలు
- రాజగోపాల్ రెడ్డికి ఉన్న మంచి పేరే గెలిపిస్తుందని ధీమా
- రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, గెలుపు ఖాయమన్న రాజగోపాల్ రెడ్డి కోడలు
- తమ పెద్ద మామయ్య వెంకటరెడ్డి కూడా నల్గొండ నుంచి గెలుస్తారని విశ్వాసం
సంకీర్త్ రెడ్డి తన తండ్రి రాజగోపాల్ రెడ్డికి తోడుగా ఉంటున్నారన్నారు. ఐటీ, మీడియా, సోషల్ మీడియాను సంకీర్త్ రెడ్డి చూసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తోందని, తమ గెలుపు ఖాయమన్నారు. తాము గడప గడపకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తన మామయ్య రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి, అలాగే తమ పెద్ద మామయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ నుంచి కచ్చితంగా గెలుస్తారన్నారు. తమ ఇద్దరు మామయ్యలకు తాము అండగా ఉంటామని, వారిని గెలిపిస్తామన్నారు.