Andhra Pradesh: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy to heavy rain alert for AP due to low pressure
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • రేపటికి అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు
  • ఈ నెల 14, 15 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
  • ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందన్న ఐఎండీ అమరావతి కేంద్రం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. నిన్నటి వరకు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ మధ్య ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించిందని తెలిపింది. 

ఈ ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉండడం వల్ల, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని, ఈ నెల 16 నాటికి వాయుగుండగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి కేంద్రం వివరించింది. 

అల్పపీడనం ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని, ఈ నెల 14, 15 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News