BJP: 17న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న బీజేపీ

BJP to release election manifesto on 17
  • ఈ నెల 17న తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
  • సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో పార్టీ మేనిఫెస్టో విడుదల
  • ఆ తర్వాత తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్న అమిత్ షా

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్నారు. అదే రోజు సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తారు. 17వ తేదీన నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ బహిరంగ సభలలో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్... ఎవరికి వారు అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News