Virat Kohli: నెదర్లాండ్స్ ఆటగాడికి కోహ్లీ గిఫ్ట్

Kohli gifts his signed jersey to Nederlands cricketer Roelof van der Merwe
  • ఆదివారం నాడు బెంగళూరులో మ్యాచ్
  • నెదర్లాండ్స్ ను 160 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
  • బ్యాటింగ్ లో అర్ధసెంచరీ చేసి, బౌలింగ్ లో ఓ వికెట్ కూడా తీసిన కోహ్లీ
  • మ్యాచ్ ముగిశాక మైదానంలో ఆసక్తికర దృశ్యం
  • వాన్ డెర్ మెర్వ్ కు తాను సంతకం చేసిన జెర్సీని కానుకగా ఇచ్చిన కింగ్

టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య నిన్న వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో టీమిండియా 160 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ సాధించడమే కాదు, బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీశాడు. 

కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నెదర్లాండ్స్ ఆటగాడు రైలోఫ్ వాన్ డెర్ మెర్వ్ కు కోహ్లీ ఓ కానుక ఇచ్చాడు. తన సంతకంతో కూడిన జెర్సీని వాన్ డెర్ మెర్వ్ కు బహూకరించాడు. కోహ్లీ జెర్సీని గిఫ్ట్ గా అందుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మురిసిపోయాడు. కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపాడు. 

వాన్ డెర్ మెర్వ్ గతంలో దక్షిణాఫ్రికా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News