Keerthi Suresh: 'ఎల్లో'రా శిల్పంలా మెరిసిన కీర్తి సురేశ్.. లేటెస్ట్ పిక్స్!

Keerthi Suresh Special
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేశ్
  • 'దసరా'తో దక్కిన మంచి మార్కులు 
  • ప్రశంసలు తెచ్చిపెట్టిన 'మా మన్నన్'
  • 'ఎల్లో' శారీలో విరబూసిన అందం 

కీర్తి సురేశ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఆమె చక్రం తిప్పుతోంది. ఈ ఏడాదిలో తెలుగులో ఆమె చేసిన 'దసరా' భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో డీ గ్లామర్ చేసిన కీర్తి సురేశ్, బారాత్ డాన్స్ బీట్ తో మాస్ ఆడియన్స్ తో హుషారెత్తించింది. ఇక  తమిళంలో కీర్తి సురేశ్ చేసిన 'మామన్నన్' సినిమా కూడా ఆమెకి అక్కడ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా ఆమె నటించింది. ఆ సినిమా ఆమెకి సక్సెస్ తో పాటు ప్రశంసలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ నుంచి వచ్చిన లేటెస్ట్ పిక్స్ ఆమె అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో శారీలో ఆమె అందంగా విరిసిన తీరు కుర్ర మనసులను కొల్లగొట్టేస్తోంది. విశాలమైన కళ్లతో విన్యాసాలు చేస్తూ, నవ్వుల మంత్రం వేస్తోంది.
Keerthi Suresh
Actress
Kollywood

More Telugu News