Krishna: ఆ రెండు హిట్ సినిమాలు కృష్ణ చేయవలసిందట!

  • 'ఖైదీ' కథ కృష్ణ విన్నారన్న మాధవరావు 
  • ఆ కథ చిరంజీవికి బాగుంటుందని చెప్పిన కృష్ణ 
  • 'కటకటాల రుద్రయ్య' కథను కృష్ణంరాజు దగ్గరికి పంపిన కృష్ణ 
  • ఆ సినిమా హిట్ అవుతుందని ఆయన ముందే చెప్పాడట

Krishna makeup men interview

కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ గా చాలాకాలం పాటు పనిచేసిన మాధవరావు, తాజా ఇంటర్వ్యూలో కృష్ణ గురించిన విషయాలను ప్రస్తావించారు. 'ఖైదీ' సినిమా కథ ముందుగా కృష్ణగారి దగ్గరకే వచ్చింది. ఆ కథ అంతా విన్న తరువాత ఆయన 'ఇది చిరంజీవికైతే కరెక్టుగా ఉంటుంది  .. ఆయనతో చేసుకోండి' అని చెప్పారని అన్నారు. 

ఇక 'కటకటాల రుద్రయ్య' కథ కూడా ముందుగా కృష్ణగారి దగ్గరికే వచ్చిందని మాధవరావు అన్నారు. ఈ కథ కృష్ణంరాజుగారికి నప్పుతుందనీ, ఆయన చేస్తే బాగుంటుందని కృష్ణగారు చెప్పారు. ఆయనతోనే చేయాలనుకుంటున్నట్టు నిర్మాతలు ఒత్తిడి చేసినా ఆయన వినిపించుకోలేదని అన్నారు.

'కటకటాల రుద్రయ్య' సినిమా విడుదల సమయంలో నేను .. కృష్ణగారు హైదరాబాదులోనే ఉన్నాము. ముందుగా థియేటర్ వారికి కబురుచేసి ఆ సినిమాకి వెళ్లాము. ఆ సినిమా చూడగానే సూపర్ హిట్ అవుతుందని కృష్ణగారు చెప్పారు. కృష్ణంరాజు బాగున్నాడనీ .. బాగా చేశాడని అన్నారు" అని చెప్పారు.

More Telugu News