Telangana Assembly Election: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు

Assembly nomination time completed
  • చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు... చివరి నిమిషంలో టిక్కెట్ల కేటాయింపు
  • పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు
  • నేటి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు
  • మూడు గంటల లోపు రిటర్నింగ్ ఆఫీస్‌కు వెళ్లి క్యూలో నిలుచుకున్న వారికి అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం... చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి గడువు ఇచ్చారు. మూడు గంటల లోగా నామినేషన్ వేసేందుకు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. నామినేషన్లకు నేడు (శుక్రవారం) చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
Telangana Assembly Election
BRS
BJP
Congress

More Telugu News