Rashmika Mandanna: నెట్టింట మరో డీప్ ఫేక్ వీడియో వైరల్... ఇది కూడా రష్మిక పైనే!

One more deepfake video on Rashmika Mandanna goes viral
  • ఇటీవల రష్మిక మందన్నపై డీప్ ఫేక్ వీడియో 
  • ఇన్ ఫ్లుయెన్సర్ జరా పటేల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్
  • ఇప్పుడు కొత్తగా రష్మిక జిమ్ సూట్లో డ్యాన్స్ చేస్తున్నట్టు మరో వీడియో
అందాలనటి రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ వీడియో బాధితురాలు అయ్యారు. ఇటీవల రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో గురించి మరువకముందే రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో తెరపైకి వచ్చింది. తాజా వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో కచ్చితత్వంతో కూడిన ఫేక్ వీడియోలను రూపొందించే వెసులుబాటు ఉంది. ఒరిజినల్ వీడియో ఉంటే తప్ప, ఫేక్ వీడియోనే నిజమైన వీడియో అని భ్రమపడేలా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు ఉంటాయి. రష్మికపై మరో డీఫ్ ఫేక్ వీడియో రావడం పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Rashmika Mandanna
Deepfake Video
Viral
AI

More Telugu News