మళ్లీ గర్భం దాల్చిన అనుష్క శర్మ? ప్రూఫ్ ఇదేనంటున్న నెటిజన్లు!
- నెట్టింట అనుష్క శర్మ, విరాట్ వీడియో వైరల్
- వీడియోలో వదులైన దుస్తులు వేసుకున్నట్టు కనిపించిన అనుష్క
- బేబీ బంప్ కూడా స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్ల వెల్లువ
ఓ హోటల్లో విరాట్, అనుష్క ఉన్న వీడియోను సోషల్ మీడియా యూజర్ ఒకరు నెట్టింట షేర్ చేశారు. ఇందులో అనుష్క వదులైన నల్లని దుస్తుల్లో మెరిసింది. ఆ దంపతులు ఒకరి చేయి మరొకరు పట్టుకుని వెళుతున్న దృశ్యం కనిపించింది. అనుష్క మళ్లీ గర్భం దాల్చిందనడానికి ఇదే తమ ప్రూఫ్ అంటూ నెటిజన్లు హడావుడి చేసేస్తున్నారు. ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచి పెట్టేందుకే ఆమె వదులైన షర్ట్ ధరించిందని, ఆమె నడకలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కొందరు కామెంట్ చేశారు. అంతేకాదు, ఆమె బేబీ బంప్ కూడా వీడియోలో కనిపిస్తోందని అంటున్నారు. ఫలితంగా, విరాట్-అనుష్క దంపతులు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.