nandiswar goud: బుల్డోజర్లతో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి

Patancheru Nandishwar Goud took Bulldozer Rally while going to file his nomination papers
  • పదుల సంఖ్యలో బుల్డోజర్లతో వచ్చిన అభ్యర్థి నందీశ్వర్ గౌడ్
  • అందరినీ ఆకర్షించిన ర్యాలీ... నెట్టింట వీడియో వైరల్
  • రేపటితో ముగియనున్న నామినేషన్ గడువు
పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ బుల్డోజర్లతో (జేసీబీ) వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. పదుల సంఖ్యలో బుల్డోజర్లకు బీజేపీ జెండాలు, హనుమాన్ జెండాలు కట్టి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. వినూత్నంగా నిర్వహించిన ఈ ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షించింది. నందీశ్వర్ గౌడ్ బుల్డోజర్లతో వచ్చి నామినేషన్ వేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్డీటీవీ ఎక్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా శ్రీధర్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు నామినేషన్ దాఖలు చేసేందుకు వినూత్నంగా వెళ్తున్నారని, పటాన్ చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ బుల్డోజర్లతో ర్యాలీ నిర్వహిస్తూ వచ్చి నామినేషన్ దాఖలు చేశారని ట్వీట్ చేశారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. నేడు మంచి రోజు కావడంతో చాలామంది ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
nandiswar goud
BJP
Telangana Assembly Election

More Telugu News