Crocodile: అమలాపురం వద్ద అందరినీ హడలెత్తిస్తున్న మొసలి ఎట్టకేలకు చిక్కింది!

Crocodile that causes fear in Amalapuram region caught
  • సమనస లాకుల వద్ద పట్టుబడిన మొసలి
  • గత 20 రోజులుగా కాల్వల్లో సంచరిస్తున్న మొసలి
  • బంధించిన విశాఖ జూ, అటవీశాఖ సిబ్బంది
అమలాపురం పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా అందరినీ హడలెత్తిస్తున్న మొసలి ఎట్టకేలకు పట్టుబడింది. విశాఖ జూ, అటవీశాఖ సిబ్బంది సమనస లాకుల వద్ద మొసలిని బంధించారు. దాంతో సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమనస గ్రామంతో పాటు నడిపూడి, కామనగరువు, అమలాపురం కాల్వల్లో గత 20 రోజులుగా ఈ మొసలి సంచరిస్తోంది. దాంతో ప్రజలు కాల్వల వద్దకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇది గోదావరి నది నుంచి ఆత్రేయపురం మీదుగా అమలాపురం వచ్చినట్టు భావిస్తున్నారు. దీన్ని బంధించేందుకు సమనస లాకుల వద్ద ట్రాప్ కేజ్ లు, వలలు ఏర్పాటు చేశారు. ఇది ట్రాప్ లో చిక్కుకోవడంతో అధికారుల శ్రమ ఫలించింది.
Crocodile
Amalapuram
Samanasa
Canal

More Telugu News