K Kavitha: బోధన్ అభ్యర్థి షకీల్ నామినేషన్ ప్రక్రియకు స్కూటర్ పై వెళ్లిన కవిత!

Kavitha went on bike to Shakeel nomination
  • అనంతరం ప్రచార వాహనంలో ర్యాలీగా నామినేషన్ ప్రక్రియకు బయలుదేరిన షకీల్, కవిత
  • దేశమంతా గులాబీ హవా నడుస్తోందని... తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందన్న కవిత
  • షకీల్ నామినేషన్ ర్యాలీ చూస్తుంటే విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తోందన్న ఎమ్మెల్సీ
బోధన్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ ప్రక్రియకు ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్కూటర్ పైన వెళ్లారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమె ద్విచక్రవాహనంపై నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్లవలసి వచ్చింది. కవిత ‌స్కూటర్ పై వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు వెంట పరుగు పెట్టారు. షకీల్ నామినేషన్ ప్రక్రియలో కవిత వెంట ఉన్నారు. కాగా, షకీల్ నామినేషన్ సందర్భంగా బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రచార వాహనంలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కవిత పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన షకీల్

షకీల్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కవిత మాట్లాడుతూ... దేశమంతా గులాబీ హవా నడుస్తోందన్నారు. షకీల్‌ను ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షకీల్ నామినేషన్‌ ర్యాలీని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తోందన్నారు. ఈ జోష్ షకీల్‌ విజయం ఖాయమని చెబుతోందన్నారు.
K Kavitha
bodhan
BRS
Telangana Assembly Election

More Telugu News