KTR: దశాబ్దాలపాటు ఏమీ చేయని కాంగ్రెస్‌ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?: కేటీఆర్

Minister KTR drags Karnataka issue into ts elections
  • కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశాలు ఇస్తే చేసిందేమీ లేదన్న కేటీఆర్
  • కాంగ్రెస్ కావాలో... కరెంట్ కావాలో ప్రజలు ఆలోచించాలని సూచన
  • 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు ఉద్దరిస్తామంటోందని విమర్శ
కాంగ్రెస్ పార్టీకి పదకొండు సార్లు అవకాశాలు ఇస్తే చేసిందేమీ లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన విద్యార్థి, యువజన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పాలన అంటే కరెంటు ఖతమేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

దశాబ్దాలపాటు ఏమీ చేయని కాంగ్రెస్‌ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు అక్కడి రైతులు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంట్‌ కోసం రైతులు విద్యుత్‌ స్టేషన్లలో మొసళ్లు వదిలే పరిస్థితి వచ్చిందన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు మళ్లీ ఉద్దరిస్తామని తిరుగుతున్నారని మండిపడ్డారు.
KTR
Telangana Assembly Election
BRS
Congress

More Telugu News