YS Bhaskar Reddy: వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్

YS bhaskar reddy granted interim bail in viveka murder case
  • నవంబర్ 30 వరకూ మధ్యంతర బెయిల్ ఇచ్చిన సీబీఐ కోర్టు
  • డిసెంబర్ 1న ఉదయం 10.30కు చంచల్‌గూడ జైలుకు రావాలని ఆదేశం
  • పాస్‌పోర్టు సరెండర్ చేయాలని, కుటుంబసభ్యులు మినహా ఎవ్వరినీ కలవొద్దని స్పష్టీకరణ
  • ప్రస్తుతమున్న ఎస్కార్ట్ బెయిల్‌ను మధ్యంతర బెయిల్‌గా మారుస్తూ ఆదేశాలు
వివేకా హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 30 వరకూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం డిసెంబర్ 1న 10.30 గంటలకు చంచల్‌గూడ్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. కోర్టులో తన పాస్‌పోర్టును సరెండర్ చేయాలని కూడా భాస్కర్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. తన చిరునామా వివరాలను కోర్టు, సీబీఐకి ఇవ్వాలని పేర్కొంది. ఇక చికిత్సకు వెళ్లాల్సి వస్తే ఆ వివరాలను కూడా సీబీఐకి తెలపాలని స్పష్టం చేసింది. కుటుంబసభ్యులను తప్ప మిగతా ఎవ్వరినీ కలవొద్దని కూడా ఆయనను కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 20న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌ను ఇంటరిమ్ బెయిల్‌గా మారుస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
YS Bhaskar Reddy
YS Vivekananda Reddy

More Telugu News