Congress: టిక్కెట్ ఇవ్వలేదని పురుగుల మందు తాగిన కాంగ్రెస్ నాయకుడు

Congress leader consumes poision for ticket
  • బాన్సువాడ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు
  • ఇటీవలే పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డికి టిక్కెట్ కేటాయించిన అధిష్ఠానం
  • టిక్కెట్ రాలేదని మనస్తాపంతో మందు తాగిన బాలరాజు... ఆసుపత్రికి తరలింపు
బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు బాన్సువాడ టిక్కెట్ రాలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగారు. దాంతో ఆయనను బాన్సువాడ రీజినల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరగానే ఆయనకు టిక్కెట్ కేటాయించారు. తాను ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నానని, కానీ రవీందర్ రెడ్డి పార్టీలో చేరీచేరగానే టిక్కెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేరిన బాలరాజును బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు. ఏనుగు రవీందర్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన అతను, ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Congress
bansuwada
BJP
Telangana Assembly Election

More Telugu News