Narendra Modi: ఈ నెల 11వ తేదీన మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ

Narendra Modi will attend madigala viswarupa sabha in hyderabad
  • నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి హైదరాబాద్‌కు ప్రధాని  
  • పరేడ్ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని
  • అదే రోజు తిరిగి ఢిల్లీకి పయనం
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. నాలుగు రోజుల్లోనే మళ్లీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 11వ తేదీన ఆయన తెలంగాణకు రానున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ఎస్సీ కేటగరైజేషన్‌పై ప్రధాని మోదీ హామీ ఇవ్వవచ్చుననే ప్రచారం సాగుతోంది.

ఈ నెల 11న సాయంత్రం గం.4.45 నిమిషాలకు మోదీ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. గం.5కు రోడ్డు మార్గంలో పరేడ్ మైదానంకు చేరుకుంటారు. గం.5 నుంచి గం.5.45 వరకు పరేడ్ మైదానంలో సభలో ఆయన ప్రసంగిస్తారు. మోదీ గం.5.55 నిమిషాలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గం.6కు బేగంపేట నుంచి ఢిల్లీకి చేరుకుంటారు.
Narendra Modi
Manda Krishna Madiga
MRPS
Hyderabad
Telangana Assembly Election
BJP

More Telugu News