Tirupati: జర్మనీ నుంచి వస్తున్న ఏపీ మహిళకు విమానంలో దారుణ అనుభవం

fellow passenger harrasses AP woman in frankfurt bengaluru luftansa plane
  • లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్రాంక్‌ఫర్ట్-బెంగళూరు విమానంలో నవంబర్ 6న ఘటన
  • మహిళ నిద్రపోతుండగా పక్క సీటులోని ప్రయాణికుడి అసభ్యకర చేష్టలు
  • బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో మహిళ ఫిర్యాదు, ప్రయాణికుడి అరెస్ట్
  • నిందితుడిని కోర్టు‌లో హాజరుపరచగా బెయిల్ మంజూరు
జర్మనీ నుంచి బెంగళూరుకు వస్తున్న ఓ ఏపీ మహిళకు విమానంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తాను నిద్రపోతున్న సమయంలో పక్క సీటులోని ప్రయాణికుడు తనను అసభ్యకరంగా తాకాడని ఆమె ఫిర్యాదు చేసింది. బెంగళూరులో విమానం దిగాక పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, తిరుపతికి చెందిన మహిళ(32) నవంబర్ 6న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో ఆమె పక్కనే ఉన్న తోటి ప్రయాణికుడు(52) బాధితురాలిని అసభ్యకరంగా తాకాడు. ఆమె వారించినా అతడి తీరు మారకపోవడంతో బాధితురాలు సిబ్బందికి చెప్పి తన సీటు మార్పించుకున్నారు. 

విమానం కెంపెగౌడ విమానాశ్రయంలో దిగాక బాధితురాలు అక్కడి పోలీసులకు ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. దీంతో, వారు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచగా, బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.
Tirupati
Bengaluru
Sexual harassment
Luftansa Airlines
Frankfurt

More Telugu News