Chetan Sharma: వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆడే రెండు టీమ్ లు ఇవే: చేతన్ శర్మ

Chetan Sharma predicts finalists of World Cup
  • ఇప్పటికే సెమీస్ కు చేరిన ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
  • నాలుగో సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్ కావచ్చన్న చేతన్ శర్మ
  • ఇండియా - ఆస్ట్రేలియా ఫైనల్స్ లో ఆడతాయని అంచనా

2023 వన్డే ప్రపంచకప్ లో లీగ్ ఫేజ్ చివరి దశకు చేరుకుంది. సెమీ ఫైనల్స్ రేసు హీట్ పెంచుతోంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయి. నాలుగో సెమీ ఫైనలిస్టు స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. మరోవైపు ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఎవరెవరు తలపడబోతారనే విషయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అంచనా వేశారు. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్ లో ఇండియా - ఆస్ట్రేలియా తలపడతాయని ఆయన చెప్పారు. నాలుగో సెమీ ఫైనలిస్టుగా న్యూజిలాండ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News