కాంగ్రెస్‌లో చేరడానికి ముందే ఐటీ దాడులు వంటి ఇబ్బందులు ఊహించా!: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ దాడులకు అవకాశముందన్న పొంగులేటి
- కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగవచ్చునని అనుమానం
- ఎన్నికల వరకు కాంగ్రెస్ నాయకులకు ఈ ఇబ్బందులు తప్పవన్న కాంగ్రెస్ నేత
- కాళేశ్వరంపై కేంద్ర సంస్థ నివేదిక ఇచ్చినా ఇంకా చర్యలు తీసుకోలేదని వ్యాఖ్య
కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు లీకులు వెంటాడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాల గురించి కేంద్ర సంస్థలు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.