Afghanistan: భారీ స్కోరుపై కన్నేసిన ఆఫ్ఘన్... ప్రస్తుతానికి 32 ఓవర్లలో 155-2

Afghanistan eyes on huge total against Aussies
  • వరల్డ్ కప్ లో నేడు ఆసీస్ × ఆఫ్ఘనిస్థాన్
  • ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
ఆడుతున్నది ఆస్ట్రేలియాతో అయినప్పటికీ ఆఫ్ఘనిస్థాన్ జట్టు దృఢ సంకల్పం కనబరుస్తోంది. ఇవాళ వరల్డ్ కప్ లో ఆసీస్, ఆఫ్ఘన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 32 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 78, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 19 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 21, రష్మత్ షా 30 పరుగులు చేసి అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 1, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతోంది.
Afghanistan
Australia
Wankhede
Mumbai
World Cup

More Telugu News