Virat Kohli: సౌతాఫ్రికాతో మ్యాచ్​ లో అందుకే ఆచితూచి ఆడా: కోహ్లీ

Virat Kohli Explains Reason Behind His Approach En Route Record 49th ODI Ton
  • వికెట్ కాపాడుకోవాలంటూ మెసేజ్ వచ్చిందన్న కోహ్లీ
  • రికార్డు సెంచరీ విషయంలో పరుగుల వేగం తగ్గడంపై వివరణ
  • ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కొనసాగించడంపైనే దృష్టి పెట్టామని వెల్లడి
సౌతాఫ్రికాపై రికార్డు సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ బ్రేక్ లో మీడియాతో మాట్లాడారు. పరుగులు రాబట్టడంలో తను కాస్త నెమ్మదించడానికి కారణం వెల్లడించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అందించిన శుభారంభాన్ని కొనసాగించడంపైనే దృష్టిపెట్టామని, అదే సమయంలో వికెట్ కాపాడుకోవాలంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన సందేశాన్ని పాటించానని తెలిపాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇతరులు ఆడేందుకు సహకరించానని కోహ్లీ పేర్కొన్నాడు. దీంతో తన పరుగుల వేగం తగ్గిందని చెప్పాడు.

అయితే, ఆ సమయంలో జట్టు ప్రయోజనాలకు తగ్గట్లుగా ఆడానని వివరించాడు. స్కోర్ బోర్డ్ ను పరుగులెత్తించడంలో రోహిత్, అయ్యర్, జడేజా, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడగా.. కోహ్లీ కాస్త ఆచితూచి ఆడడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 121 బంతులకు 101 పరుగులు చేసి, సచిన్ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది.


Virat Kohli
southafrica match
record century
49 th century
sports

More Telugu News