కోహ్లీ సెంచరీ కొట్టినట్లు కేసీఆర్ కూడా సెంచరీ కొడతారు: కేటీఆర్

KTR says brs will form government with 100 seats
  • 30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందన్న కేటీఆర్
  • తెలంగాణ స్టోరీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్‌దే అన్న మంత్రి
  • కానీ కాంగ్రెస్ సినిమాకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్ అని ఎద్దేవా
  • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటోంది కానీ నవంబర్ 30న తెలంగాణ సిక్స్ కొడుతుందన్న కేటీఆర్
కేసీఆర్ సినిమా ఈ నెల 30న బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందని, బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ సినిమాకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, గుజరాత్ యాక్టర్ అంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమన్నారు. మన తెలంగాణ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆరే అని, అందుకే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమన్నారు. తెలంగాణను ఎవరు నడపాలనేది నిర్ణయించాల్సింది ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాదని, తెలంగాణ గల్లీ నిర్ణయించాలన్నారు.

ఢిల్లీ చేతికి జుట్టు ఇస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రిని మారుస్తారన్నారు. తమ పార్టీ తరఫున ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేసినా అతనిని కేసీఆరే అనుకోవాలన్నారు. అవ‌త‌లి పార్టీకి ఓటేస్తే అది ఢిల్లీకి, గుజరాత్‌కు వెళుతుందన్నారు. వేముల‌వాడ‌కు పరిశ్రమలు తేవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మెజార్టీ విష‌యంలో సిరిసిల్ల‌తో పోటీ ప‌డాల‌ని సూచించారు. 

సిక్స్ పాయింట్ ఫార్ములాను ఇందిరా గాంధీ తుంగలో తొక్కారని, ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణకు వచ్చి ఆరు గ్యారెంటీలు అంటున్నారని, కానీ నవంబర్ 30న తెలంగాణ సిక్స్ కొట్టుడు ఖాయమన్నారు. కోహ్లీ సెంచరీ కొట్టినట్లు కేసీఆర్ సెంచరీ కొడతారన్నారు. 100 సీట్లతో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం పక్కా అని స్పష్టం చేశారు.
Go Back to Shorts
KTR
KCR
BRS
Telangana Assembly Election

More Telugu News