Vijayashanti: బీజేపీ క్యాంపెయినర్స్ జాబితాలో కనిపించని విజయశాంతి పేరు... 40 మంది ప్రచారకర్తలు వీరే...!

BJP releases campain list with 40 members
  • జాతీయస్థాయి నేతల్లో మోదీ, నడ్డా, అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ పేర్లు
  • తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, పురందేశ్వరి, ఈటల, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరుల పేర్లు
  • జాబితాలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నలభై మందితో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి పేరు లేకపోవడం గమనార్హం. స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరుల పేర్లు ఉన్నాయి. జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి పేర్లు ఉన్నాయి. ఏపీ నుంచి ప్రధానంగా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు ఉంది.

ఇక ఆ నలభై మంది ప్రచారకర్తలు వీరే...


 నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యడ్యూరప్ప, డాక్టర్ కే లక్ష్మణ్, యోగి ఆదిత్యనాథ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఎల్ మురుగన్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, అరవింద్ మీనన్, డీకే అరుణ, మురళీధర రావు, దగ్గుబాటి పురందేశ్వరి, రవికిషన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, టి కృష్ణ ప్రసాద్ ఉన్నారు.
Vijayashanti
BJP
Telangana Assembly Election
Narendra Modi

More Telugu News